Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఆస్కార్ మెంబర్‌లిస్ట్‌లో చెర్రీ పేరు

Globel Star Ramcharan name lists in Oscar academy
Advertisement
  • మెంబర్ లిస్ట్ విడుదల చేసిన అకాడమీ
  • నటనలో నైపుణ్యంతో సాధారణ క్షణాలను అసాధారణంగా మార్చారంటూ ప్రశంసలు
  • సాదరంగా ఆహ్వానిస్తున్నామన్న అకాడమీ
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయికి ఎదిగిన టాలీవుడ్ అగ్రనటుడు రామ్ చరణ్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన నటుల జాబితాలో చెర్రీకి చోటు లభించింది. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోతూ ఎక్స్‌లో రియాక్టవుతున్నారు. నటనలో అంకితభావం, ప్రామాణికతతో ఈ నటులు మన హృదయాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్న అకాడమీ.. నటనలో వారి నైపుణ్యం సాధారణ క్షణాలను అసాధార అనుభవంగా మారుస్తుందని ప్రశంసించింది. అకాడమీలోకి మరికొందరు నటులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. 

అకాడమీ విడుదల చేసిన జాబితాలో లషన లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కో టిన్ లోక్, కేకే పామెర్, చాంగ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డావి ఉన్నారు.  అకాడమీ బ్రాంచ్‌లోకి వీరిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, ఆస్కార్ ఇది వరకే ప్రకటించిన మెంబర్స్ ఆఫ్ క్లాస్ జాబితాలో ఎన్టీఆర్‌ ఇప్పటికే చోటు దక్కించుకున్నారు.
Advertisement
Advertisement
Ramcharan
Tollywood
Oscar
Oscar Academy

More Telugu News